ఎస్సై అత్యాచారం.. డాక్టర్ సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్రలో ఓ ఎస్సైపై అత్యాచార ఆరోపణలు చేస్తూ లేడీ డాక్టర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

ఎస్సై అత్యాచారం.. డాక్టర్ సూసైడ్ నోట్‌లో కీలక విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఓ ఎస్సైపై అత్యాచార ఆరోపణలు చేస్తూ లేడీ డాక్టర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తనపై ఒక ఎస్సై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతని వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొంది. నాలుగు పేజీల సూసైడ్ నోట్ లో ఎంపీ పేరు కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. 26 ఏళ్ల డాక్టర్ రాసిన సూసైడ్ నోట్ లో పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 పేజీల సూసైడ్ నోట్ లో ఆమె పలు విషయాలను వెల్లడించింది. నిందితులను మెడికల్ టెస్టులకు తీసుకురాకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకు తాను నో చెప్పడంతో ఎస్సై గోపాల్ బదానే, మరికొందరు పోలీస్ అధికారులు తనను వేధించారని వాపోయింది. ఎస్సై తనపై 4 సార్లు అత్యాచారం చేశాడని, 5 నెలలకు పైగా మానసికంగా, శారీరకంగా హింసించాడని తెలిపింది. టెస్టులు చేయకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వనని చెప్పినందుకు ఓ ఎంపీ తనను ఫోన్ లో బెదిరించాడని, అతని సహాయకులు కూడా వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొడుకు ప్రశాంత్ పై కూడా ఈ తరహా ఆరోపణలే చేసింది.

డాక్టర్ సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఇంటి యజమాని కొడుకు ప్రశాంత్ బంకర్ ను మహారాష్ట్ర పోలసులు అరెస్ట్ చేశారు. కాగా.. బాధితురాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ బంధువులని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు.

Next Story