- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Doctor : ఐదేళ్లుగా స్నానం చేయని అమెరికా డాక్టర్.. ఆ తర్వాత ఏమైందంటే?
అమెరికాకు చెందిన వైద్యుడు ఐదేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నాడు. తరచుగా స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? మన శరీరం నుంచి దుర్వాసన వస్తుందా లేదా?

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు చెందిన వైద్యుడు ఐదేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నాడు. తరచుగా స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? మన శరీరం నుంచి దుర్వాసన వస్తుందా లేదా? మన చర్మం రకరకాల బ్యాక్టీరియా ఉంటుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు న్యూయార్క్‌కు చెందిన హాంబ్లిన్ అనే వైద్యుడు వినూత్న ప్రయోగం చేశాడు. తరచుగా స్నానం చేయకపోతే ఏం జరుగుతోందనే దాని గురించి ఆయన రీసెర్చ్ చేశారు. `స్నానం చేయకపోవడం వల్ల నా జీవితంలో చాలా సమయం, డబ్బు ఆదా అయింది. అలాగే చర్మంపై ఉండే సూక్ష్మజీవుల గురించి చాలా తెలుసుకున్నా. మన శరీరం లోపల, చర్మం పైన వందల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అందులో మనకు మంచి చేసే బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉంటుంది. మనం తరచుగా స్నానం చేయడం వల్ల, శరీరాన్ని శుభ్రపరచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంద`ని హాంబ్లిన్ చెప్పాడు. `నా చర్మం చాలా జిడ్డుగా ఉండేది. నేను స్నానం చేయడం మానేసిన తర్వాత నా చర్మం జిడ్డుగా మారడం తగ్గింది. తామర కూడా తగ్గింది. అలాగే దుర్వాసన కూడా వచ్చేది కాద`ని తెలిపాడు.
దుర్వాసన గురించి ప్రశ్నలు..
చాలా మంది తన నుంచి దుర్వాసన వస్తుందా లేదా అనే ప్రశ్నలు వేశారని హాంబ్లిన్ అన్నాడు. అయితే, అలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వింతగా అనిపించినప్పటికీ.. తాను ఇప్పటికీ సబ్బుతో చేతులు కడుక్కుంటానని అన్నాడు. అప్పుడప్పుడు తన జుట్టుని వాష్ చేసుకుంటానని.. మురికిగా అన్పించినప్పుడు స్నానం చేస్తానని హాంబ్లిన్ ఒప్పుకున్నాడు. అయితే, చాలా చర్మ సంరక్షణ, పర్సనల్ హైజీన్ ఉత్పత్తులు కేవలం శుభ్రత కోసం మాత్రమే కాకుండా, సువాసన, సౌకర్యం కోసం కూడా రూపొందించారని హాంబ్లిన్ చెప్పుకొచ్చాడు. సోప్ వల్ల మురికి, జిడ్డు పోతుందని.. అయితే నీటి కింద చేతులు కడగటం వల్ల సూక్ష్మక్రిములు ఉండవని అన్నారు. అయితే, స్నానం చేయడం వల్ల నష్టాలు ఉన్నప్పటికీ, చేయకుండా ఉండడం చాలా దుర్భరంగా ఉంటుందని హాంబ్లిన్ పేర్కొన్నాడు.






