ఇందిరాగాంధీ ఆస్పత్రిలో దారుణం.. రోగిని ఇష్టమొచ్చిన కొట్టిన వైద్యుడు

by Vemula.Srinu Prasad |

ఇందిరాగాంధీ ఆస్పత్రిలో రోగిని వైద్యుడు ఇష్టమొచ్చిన కొట్టారు..

ఇందిరాగాంధీ ఆస్పత్రిలో దారుణం.. రోగిని ఇష్టమొచ్చిన కొట్టిన వైద్యుడు
X

దిశ, వెబ్ డెస్క్: సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ)లో దారుణం జరిగింది. రోగిపై వైద్యుడు దాడి చేశారు. శ్వాసకోస సంబంధింత వ్యాధితో బాధ పడుతున్న రోగి పట్ల డాక్టర్ అమానుషంగా వ్యవహరించారు. చికిత్సపై ప్రశ్నించినందుకు బూతులు మాట్లాడుతూ విచారణారహితంగా దాడి చేశారు. దీంతో రోగికి గాయాలు అయ్యాయి. అసలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న రోగిపై దాడి చేయడం దారుణమని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మరోవైపు రోగిని కొడుతున్న వైద్యుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో డాక్టర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమై డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story