- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంకల్పంతో కళ్లు లేకున్నా కలెక్టర్‌గా.. ఆమె ఎవరో తెలుసా!
ధృడ నిశ్చయం, సంకల్పం ఉంటే ఏ అవరోధమూ విజయాన్ని ఆపలేదన్న మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ధృడ నిశ్చయం, సంకల్పం ఉంటే ఏ అవరోధమూ విజయాన్ని ఆపలేదన్న మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏ పనీ చేయకుండా తిరుగుతున్న యువత అనేక మంది ఉన్న నేటి రోజుల్లో.. అవయవ లోపం ఉన్న ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఏ భాగం పని చేయకున్నా ఇబ్బందిగానే ఉంటుంది.
కళ్ళు లేకపోతే అన్నిటికంటే దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిని సైతం ఎదుర్కొని తనకు వచ్చిన ఎన్నో కష్టాలను అధిగమించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావించిన ఓ మహిళ సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ప్రొంజల్ పాటిల్ ఇండియాలో మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న మహిళా ఐఏఎస్‌గా గుర్తింపు పొందారు. చిన్నప్పుడే చూపు కోల్పోయిన బ్రెయిలీ, స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీతో చదువుకున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ పూర్తి చేసి యూపీఎస్‌సీ కి ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలోనే 2016లో రైల్వే(IRAS)లో ఉద్యోగం సాధించినప్పటికీ వైకల్యం కారణంగా తిరస్కరణకు గురయ్యారు. 2017లో 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.






