భారతదేశంలో త్రివర్ణ పతాకాలు ఎక్కడ తయారవుతాయో తెలుసా ?

by Batti.Sumithra |

భారతదేశ వ్యాప్తంగా జనవరి 26న 75 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

భారతదేశంలో త్రివర్ణ పతాకాలు ఎక్కడ తయారవుతాయో తెలుసా ?
X

దిశ, ఫీచర్స్ : భారతదేశ వ్యాప్తంగా జనవరి 26న 75 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేదీన అమల్లోకి వచ్చిందని. అప్పటి నుంచి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజున భారతదేశమంతటా త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తారు. మువ్వనెలతో దేశవ్యాప్తంగా ఎగిరే ఈ త్రివర్ణ పతాకాలు ఎక్కడ తయారు అవుతాయో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఏయే ప్రాంతాల్లో వీటిని తయారు చేస్తారు. ఏయే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకలోని హుబ్లీ నగరంలో గల ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ జాయింట్ సంఘ్ అంటే KKGS ​​త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు పంపే బాధ్యతను తీసుకుంది. త్రివర్ణ పతాకాన్ని తయారు చేయడానికి ఇది ఏకైక జాతీయ జెండా తయారీ యూనిట్.

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు ఇక్కడి నుంచే త్రివర్ణ పతాకాలను తయారు చేసి పంపుతారట. అయితే, ఎవరైనా జాతీయ జెండాను కొరియర్ ద్వారా ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు. పార్లమెంట్, ఎంబసీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థకు జెండాలను పంపే ముందు, వాటి ప్రమాణాలను కూడా పరీక్షించాలి.

హుబ్లీలోనే కాదు, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, ముంబైలో కూడా భారతదేశ జాతీయ జెండాను సిద్ధం చేస్తారు. అయితే గ్వాలియర్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది సెంట్రల్ ఇండియా ఖాదీ సంఘ్‌లోని ఒక ప్రదేశం. ఇక్కడ 90 శాతం మంది కార్మికులు మహిళలు ఉన్నారు. దీంతో పాటు మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా త్రివర్ణ పతాకాన్ని తయారు చేస్తారు.

Next Story