- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిటికెడు సిందూరం విలువ నీకేం తెలుసు.. జయాబచ్చన్‌కు ఢిల్లీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్
పహల్గాం టెర్రర్ అటాక్‌కు బదులుగా ఉగ్రమూకలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌కు.. ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్‌కు బదులుగా ఉగ్రమూకలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌కు.. ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడం పట్ల రాజ్యసభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపరేషన్ పేరు స్త్రీల సిందూరాన్ని అపవిత్రం చేసేలా ఉందని కామెంట్ చేశారు. పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల సంప్రదాయ గుర్తైన సిందూరాన్ని అలా ఆపరేషన్లకు పేర్లు వాడటం సరికాదన్నారు. అసలు ఆ పేరు ఎందుకు ఎంచుకున్నారని, దాని వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే జయాబచ్చన్ వ్యాఖ్యలపై తాజాగా ఢిల్లీ సీఎం రేఖ గుప్త స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జయబచ్చన్‌కు తెలిసింది సినిమాల గురించి మాత్రమేనని.. దేశం గురించి ఏం తెలుసని అన్నారు. ‘ఏక్ చుట్కీ సిందూర్ కీ కీమత్ తుమ్ క్యా జానో? (ఒక చిటికెడు సిందూరం విలువ నీకు ఏమి తెలుసు?) సినిమా డైలాగ్ వినిపిస్తూ జయా బచ్చన్‌కు బదులిచ్చారు. చట్ట సభల్లో విపక్షాలు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్లంతా.. భారతదేశానికి చెందిన వారేనా.. లేక పాకిస్తాన్, అమెరికా నుంచి వచ్చారా అంటూ సీఎం రేఖ గుప్తా సెటైర్లు వేశారు.






