Jairam Ramesh: అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తున్నా పట్టించుకోరా? జైరాం రమేశ్

by Shamantha N |

అమెరికాలో భారతీయుల ఆత్మగౌరవం మంటగలిసిపోతుందని విద్యార్థులను పోలీసులు నిర్భంధించి అణిచి వేయడంపై ప్రధాని స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.

Jairam Ramesh: అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తున్నా పట్టించుకోరా? జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారతీయుల ఆత్మగౌరవం మంటగలిసిపోతుందని విద్యార్థులను పోలీసులు నిర్భంధించి అణిచి వేయడంపై ప్రధాని స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. అమెరికాలో ఓ భారతీయ యువకుడిని అక్కడి భద్రతాధికారులు నేలపై పడేసి.. చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు. ఇందులో అతడు తీవ్రంగా రోధిస్తున్నాడు. అక్కడే ఉన్న మరో భారతీయ వ్యక్తి దీన్ని వీడియో తీసి విదేశాంగ మంత్రి జైశంకర్ కు ట్వీట్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జైరాం రమేశ్ కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. జైరాం రమేశ్ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘భారతీయుల గౌరవాన్ని కాపాడటంలో మోదీ తరచూ విఫలమవుతునే ఉన్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక విదేశీ అధ్యక్షుడు భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడం ఎంతవరకు సమంజసం అన్నారు.

పదే పదే అవమానాలు జరుగుతున్నా పట్టించుకోరా?

భారతీయుల మీద ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ చేశామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా అమెరికాలో చెబుతున్నాడు. అమెరికాలో భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయ్.. పదే పదే అవమానాలు జరుగుతున్నాయి అయినప్పటికీ ప్రధాని మోదీ స్పందించడం లేదు. అమెరికాలో ఇండియన్స్ మీద జరుగుతున్న దాడులపై వెంటనే స్పందించాలని ట్రంప్ తో ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయంలో ఒక భారతీయ యువకుడిని అక్కడి భద్రతాధికారులు అమానుషంగా బంధించారు. అనంతరం అతడిని భారత్‌కు తిప్పి పంపారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేసి భారత ఎంబసీనీ, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియో తెగ వైరల్ అవుతోంది.

Next Story