డీఎంకే దొంగ ఓట్ల ఆటలు సాగవు.. తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా ప్రక్షాళనపై బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

డీఎంకే దొంగ ఓట్ల ఆటలు సాగవు.. తమిళసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల తేదీల ప్రకటనపై బీజేపీ (BJP) సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ (Tamil Sai Soundararajan) హర్షం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆమె కొనియాడారు. ఇవాళ ఆమె మీడియాలో మాట్లాడుతూ.. అధికార డీఎంకే (DMK) పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో డీఎంకే పార్టీ చనిపోయిన వారి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో ఉంచి తప్పుడు లెక్కలతో ఎన్నికలకు వెళ్లేదని తమిళసై ఆరోపించారు. కనీసం ఇప్పుడైనా చనిపోయిన ఆత్మలు స్వర్గంలో ప్రశాంతంగా ఉంటాయని, డీఎంకే వారిని ఇబ్బంది పెట్టదంటూ సెటైర్లు వేశారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళనను తొలుత సీఎం స్టాలిన్ (CM Stalin) వ్యతిరేకించారని, మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారంటూ విమర్శలు చేశారని తమిళసై గుర్తు చేశారు. అయితే, అర్హులైన ఒక్క ఓటరు కూడా తొలగిపోరని, అనర్హులకు చోటు ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. తమిళనాడులో ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, ఎన్నికలకు సరిపడా సమయం కూడా ఉందని తెలిపారు. ఈసారి క్లీన్ ఓటర్ లిస్ట్‌తో ఎన్నికలకు వెళ్తున్నామని, బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని తమిళసై ధీమా వ్యక్తం చేశారు.

Next Story