తల్లితో రిలేషన్.. రెండున్నరేళ్ల పాపై లైంగిక దాడి

by Phanindra |

తల్లితో రిలేషన్.. రెండున్నరేళ్ల పాపై లైంగిక దాడి చేసిన డీఎంకే కార్యకర్త. తమిళనాట షాకింగ్ ఘటన.

తల్లితో రిలేషన్.. రెండున్నరేళ్ల పాపై లైంగిక దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: లివ్ ఇన్ పార్టనర్‌ రెండున్నరేళ్ల కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేశాడో కిరాతకుడు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగు చూసింది. భర్త సూర్యతో గొడవపడి వచ్చేసిన ప్రిన్సీ అనే 24 ఏళ్ల యువతి.. పెరియనాగం అనే 40 ఏళ్ల వ్యక్తితో లివ్‌-ఇన్ రిలేషన్‌లో ఉంది. వేరుగా ఉంటున్నా కూడా బిడ్డపై ప్రేమతో సూర్య అప్పుడప్పుడూ వచ్చి పాపను చూసి వెళ్తుంటాడు. ఇటీవల పాప గిలగిలా కొట్టుకొని స్పృహకోల్పోయిందంటూ ఆస్పత్రిలో చేర్పించింది ప్రిన్సీ. అయితే అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న పాప ఇలా చనిపోవడంతో అనుమానించిన సూర్య.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టంలో రెండున్నరేళ్ల పాప ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలు ఉన్నట్లు తేలింది. దర్యాప్తు చేయగా.. ప్రిన్సీ లివ్-ఇన్ బంధం బయటపడింది. ఆమె ఇంట్లో లేనప్పుడు ఈ ఘాతుకం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పెరియనాయగంను పోలీసులు అరెస్టు చేశారు. పెరియనాయగం స్థానికంగా డీఎంకే పార్టీ కార్యకర్త కూడా కావడంతో ఈ కేసు రాజకీయంగా దుమారం రేపుతోంది.

Next Story