DMK: ప్రజా ధనంతో పార్టీ నేతల విగ్రహాలా.. తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్

by B.Srinivas |

తమిళనాడులోనిద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

DMK: ప్రజా ధనంతో పార్టీ నేతల విగ్రహాలా.. తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ద్రవిడ మున్నేట్ర కజగం (Dmk) ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ పార్టీ నాయకులను కీర్తించేందుకు ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించింది. పార్టీ నేతల విగ్రహాలకు ప్రభుత్వ నిధులను ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రజా ఆర్చ్ ప్రవేశ ద్వారం దగ్గర దివంగత నాయకుడు కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి అనుమతి లేదని పార్టీ నాయకుల విగ్రహాలకు ప్రజా నిధులు ఎలా ఉపయోగిస్తారని నిలదీసింది. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరంచిన న్యాయస్థానం పిటిషన్‌ను ఉపసంహరించుకుని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ప్రభుత్వ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అంతకుముందు మద్రాస్ హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

Next Story