vice president: బీజేపీకి చెక్.. ఇండియా కూటమి అభ్యర్థిగా సౌత్ ఎంపీ!

by Prasad Jukanti |   (  Updated:2025-08-18 10:44:13  IST  )

ఇండియా కూటమి అభ్యర్థిగా డీఎంకే ఎంపీ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

vice president: బీజేపీకి చెక్.. ఇండియా కూటమి అభ్యర్థిగా సౌత్  ఎంపీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల అంశం ఆసక్తిని రేపుతోంది. ఎన్డీయే కూటమి (India Alliance) తరపున తమిళనాడుకు చెందిన నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారు అయింది. దీంతో ఇండియా కూటమి ఎవరిని పోటీలోకి దింపబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను ఎంపికే చేసేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సౌత్ ఇండియా సెంటిమెంట్ అస్త్రంగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతున్న వేళ అదే తమిళనాడుకు చెందిన తిరుచ్చి శివను (Tiruchi Shiva) రంగంలోకి దింపడం ద్వారా ఎన్డీయే కూటమికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఓబీసీ వర్సెస్ దళిత్?:

సౌత్ సెంటిమెంట్ ద్వారా ఎన్డీయేతర పార్టీల మద్దతును సైతం కూడగట్టేందుకే బీజేపీ సౌత్ ఇండియా అస్త్రాన్ని ప్రయోగించిందనే టాక్ వినిపిస్తోంది. ఇండియా కూటమి దక్షిణాది వ్యక్తిని కాదని నార్త్ ఇండియన్ ను బరిలోకి దింపితే సౌత్ కు చెందిన ప్రాంతీయ పార్టీల పరిస్థితి డైలామాలో పడాల్సి వచ్చేది. ముఖ్యంగా తమిళ సెంటిమెంట్ తో రాజకీయాలు నడిపిస్తున్న డీఎంకే ఇండియా కూటమిలో ఉంటూ ఇతర ప్రాంత వ్యక్తికి మద్దతు తెలపడం రాజకీయంగా బీజేపీకి అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి చెక్ పెట్టేందుకు తమిళనాడుకు చెందిన వ్యక్తినే బరిలోకి దింపేందుకు ఇండియా కూటమి రెడీ అయిందని తిరుచ్చి శివ పేరు దాదాపు ఖరారు అయిందనే ప్రచారం గుప్పుమంటోంది. అయితే ఎన్డీయే అభ్యర్థి ఓబీసీ వ్యక్తి కాగా శివ దళిత నేత. ప్రస్తుతం రాష్ట్రపతి గిరిజన వ్యక్తి కాగా ప్రధానిగా ఓబీసీ కి చెందిన వ్యక్తి ఉన్నారు. ఉప రాష్ట్రపతిగా దళిత వ్యక్తి ఉండటమే సముచితం అనే నిర్ణయంతో ఇండియా కూటమి శివ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story