- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెరపైకి DMK, AIADMK సంకీర్ణ కూటమి.. TVK చీఫ్ విజయ్ మాస్ వార్నింగ్
తమిళనాటీ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదు అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం రేపగా, దానికి ప్రతిగా టీవీకే (TVK) అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం అరవ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతున్న వేళ గవర్నర్ అర్లేకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సంకీర్ణ కూటమి అయినా సరే, ఏ పార్టీ అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు స్పష్టమైన నెంబర్ చూపిస్తుందో, వారికే బలనిరూపణకు అవకాశం ఇస్తానని గవర్నర్ ప్రకటించారు. తనకు నెంబర్ ముఖ్యం తప్ప, వ్యక్తుల గణన (Head Count) కాదని ఆయన వ్యాఖ్యానించడంపై టీవీకే, కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు..?
అయితే, దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK)లు అధికారం పంచుకునేందుకు చేతులు కలపబోతున్నాయనే వార్తలు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. నిన్న పుదుచ్చేరిలోని ఓ రిసార్టులో తమ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కలిశారు. ఆ సందర్భంగా ఆయన త్వరలోనే మంచి జరగనుందని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గవర్నర్‌కు విజయ్ అల్టిమేటం..
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఎత్తుగడలపై టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అధికారం కోసం ఆ రెండు ఒక్కటవ్వాలని చూస్తే, తన పార్టీ తరపున గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్ చెప్పినట్లుగా సమాచారం. సిద్ధాంతపరంగా బద్ధశత్రువులైన పార్టీలు కేవలం పదవుల కోసం ఒక్కటవ్వడం తమిళనాడు ప్రజలను వంచించడమేనని టీవీకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, రాష్ట్రం మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మద్దతు కోసం ఇప్పటికే చిన్న పార్టీలతో చర్చిస్తున్న విజయ్, పాత పార్టీల అపవిత్ర పొత్తును అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.






