- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు
బెంగళూరులోని లోక్ భవన్ వేదికగా డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా సాగుతున్న అధికార పీఠం ఉత్కంఠకు తెరదించుతూ.. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shiva Kumar) ఇవాళ కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్ భవన్‌లో జరిగిన ఈ ఘనమైన వేడుకలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం వీడి సతీషన్, తదితరులు హాజరయ్యారు. సీఎం డీకే శివకుమార్ వెంట మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కూడా చోటు దక్కడం విశేషం.
కాగా, మే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ సమయంలో అధిష్టానం కుదిర్చిన అధికార భాగస్వామ్య ఒప్పందం (Power-sharing formula) ప్రకారం ఐదేళ్ల పదవీ కాలాన్ని సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ చెరిసగం పంచుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.






