నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు.. డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎప్పుడూ భేదాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌లేద‌న్నారు.

నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు.. డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్యతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎప్పుడూ భేదాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌లేద‌న్నారు. తాము క‌లిసే ప‌నిచేస్తున్నామ‌ని.. క‌ర్నాట‌క భ‌విష్య‌త్ పై ఎన్నో ఆశ‌లు ఉన్నాయ‌ని చెప్పారు. వాటిని నెర‌వేర్చ‌డం కోసం తాము క‌లిసే ప‌నిచేస్తామ‌ని తెలిపారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన లిమిల్స్ ఏంటో త‌న‌కు తెలుస‌ని వ్యాఖ్యానించారు.

2028లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంపై త‌మ పార్టీ నేత‌లు దృష్టి పెట్టామ‌ని చెప్పారు. రాష్ట్రంలో స‌మ‌స్య‌ల‌పై వివిధ పార్టీల‌తో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపారు. ఇదిలా ఉంటే గ‌త కొద్దిరోజులుగా క‌ర్నాట‌క‌లో సీఎం మార్పు ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. సిద్ధ‌రామ‌య్య‌ను కుర్చీ నుండి దింపి డీకే శివ‌కుమార్ కు క‌ట్ట‌బెడ‌తారనే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్త‌ల‌కు డీకే చెక్ పెట్టేశారు.

Next Story