- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
130 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకే..డీకే శివకుమార్ సంచలనం !
కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివ కుమార్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ( Karnataka) రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాట కర్ణాటకలో ఇబ్బందిగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి శివ కుమార్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ? అనే టెన్షన్ అందరిలోనూ ఉంటుంది. పార్టీని కష్టపడి అధికారంలోకి తీసుకువచ్చింది డీకే శివకుమార్ అని, అలాంటి ట్రబుల్ షూటర్ ను కాదని సిద్ధ రామయ్యకు సీఎం పదవి ఇవ్వడంపై ఇప్పటికి చాలా మంది గుర్రగా ఉన్నారని ప్రచారం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మకాం వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజులుగా ఢిల్లీలోనే డీకే శివ కుమార్
కర్ణాటక సీఎం పీఠం పై డీకే శివ కుమార్ ( Dk Shivakumar) కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీలో కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మకాం వేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు రెండు రోజులుగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉంటున్నారట. అంతేకాదు కాంగ్రెస్ పెద్దలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారట ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్.
కర్ణాటకలోని నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లానని డీకే శివ కుమార్ చెప్పినప్పటికీ.. అసలు మ్యాటర్ అది కాదట. సీఎం కూర్చి పై మరోసారి డీకే శివ కుమార్ కన్నేసినట్లు తెలుస్తోంది. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారట. పార్టీని అధికారంలోకి తాను తీసుకువచ్చాను..తన కష్టం పైన కాంగ్రెస్ (Congress Party ) గెలిచిందనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారట. రెండున్నర ఏళ్ల ఫార్ములా ప్రకారం డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోనే కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ముఖం వేసిన నేపథ్యంలో ఇటు సిద్ధ రామయ్య వర్గం కూడా స్పందిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు లేదని.. ఈ మధ్య కాలంలో దానిపై చర్చ అనేది జరగబోదని వెల్లడిస్తున్నారు సిద్ధ రామయ్య వర్గం ఎమ్మెల్యేలు. సిద్ధ రామయ్య ఇప్పుడే పదవి నుంచి తప్పు కోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. డీకే శివ కుమార్ కేవలం కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల పై కేంద్ర పెద్దలతో అలాగే పార్టీ పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో సమావేశం అయ్యేందుకు మాత్రమే వెళ్లారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో కర్ణాటక సీఎం మార్పు అనే సమస్య లేదని, కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్ధ రామయ్య ( CM Siddaramaiah) వర్గం ఎమ్మెల్యేలు. మరి దీని పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.






