- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యంలో విమర్శలు భాగమే, కానీ.. డీకే శివ కుమార్ కీలక వ్యాక్యలు
ప్రతిపక్షాల విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యంగ హక్కును దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్షాల విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యంగ హక్కును దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించదగినవే అయినప్పటికీ, అవి పరిమితుల్లోనే ఉండాలని వ్యాఖ్యానించారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మరియు ఇతర మంత్రుల ఛాయాచిత్రాలను స్కామ్ లార్డ్స్ అనే శీర్షికతో బీజేపీ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ పై డీకే ఈ కామెంట్స్ చేశారు.
మరోవైపు బీజేపీ ఈ పోస్ట్ పెట్టిన తరవాత కర్ణాటక కాంగ్రెస్ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, నిరాధారామైనవి అని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికైన ప్రతినిధుల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో ఈ పోస్ట్ పెట్టారని తెలిపింది. ఈ కంటెంట్ డిజిటల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హత్యకు సమానం అని, సమాజంలో గందరగోళం మరియు అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో పెట్టారని ఆరోపించింది.






