‘సిద్ధరామయ్యే కర్ణాటక సీఎం’.. సీఎం మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ క్లారిటీ

by Ramesh Naini |   (  Updated:2025-11-21 13:11:17  IST  )

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు విషయం చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు.

‘సిద్ధరామయ్యే కర్ణాటక సీఎం’.. సీఎం మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు విషయం చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. సీఎం పదవిలో ఎలాంటి మార్పు ఉండదని, సిద్ధరామయ్యే మొత్తం పదవి కాలం సీఎం గా కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా సీఎం మార్పు ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. సిద్ధరామయ్య నేతృత్వంలో తాము సమష్టిగా పనిచేస్తామని శివ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తనవారేనని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేలే అని పేర్కొన్నారు.

ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం నా రక్తంలో లేదు.. అని డీకే శివకుమార్ ట్వీట్‌లో తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఎమ్మెల్యేల ఎందుకు సమావేశం అయ్యారని ప్రశ్నిస్తే.. వారు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు నాలుగైదు డిప్యూటీ సీఎం పదవులను కోరుతూ చేసిన వినతులపై చర్చించారని శివకుమార్ స్పష్టం చేశారు. నేను, ముఖ్యమంత్రి ఇద్దరం హైకమాండ్‌కు కట్టుబడి ఉంటాము అని పదే పదే చెప్పాము.. అని తెలిపారు.

కాగా, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి అంశంలో రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. ఈ గురువారంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారుకు రెండున్నరేళ్లు నిండాయి. దీంతో కర్ణాటక రాజకీయం హీటెక్కింది. మరోవైపు సిద్దరామయ్య, డీకే శివకుమార్ మద్దతు దారులు ఒక్కొక్కరిగా ఢిల్లీకి వెళ్లడంతో ప్రచారం జోరు పెరిగింది. ఈ అంశంపై ఏకంగా సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న నాయకత్వ మార్పు చర్చలకు పూర్తిగా తెరపడినట్లైంది. ట్వీట్ ఇదే..

Next Story