- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DK: మూడు నెలల్లో డీకే శివకుమార్ సీఎం అయ్యే చాన్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్భాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్ తదుపరి సీఎం కావొచ్చని వ్యాఖ్యానించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్భాల్ హుస్సేన్ (Iqbal Hussain) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Dk shivakumar) తదుపరి రాష్ట్ర సీఎం కావొచ్చని వ్యాఖ్యానించారు. ఆయన త్వరలోనే సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ విజయంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారని నొక్కి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు వెనుక డీకే కృషి ఉందని, దానిని ఎవరూ విస్మరించలేరన్నారు. ఈ ఏడాది లోపు ఆయన సీఎం అవుతారని తెలిపారు. సెప్టెంబర్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారతాయన్నారు. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul gandhi), మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) లు కలిసి తీసుకున్నారని, తదుపరి డిసిషన్ కూడా వారే తీసుకుంటారని చెప్పారు. దీని కోసం అందరూ వేచి చూడాలని తెలిపారు. హుస్సేన్ వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా సంచనం రేగింది. ఎందుకంటే హుస్సేన్‌ను శివకుమార్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. కాబట్టి ఆయన వాదనతో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.






