Viral video: భార్యతో విడాకులు.. సంతోషంతో 40 లీటర్లు పాలతో స్నానం.. అస్సాంలో ఘటన వైరల్

by Ramesh Naini |

ఓ వ్యక్తి తన భార్యలకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Viral video: భార్యతో విడాకులు.. సంతోషంతో 40 లీటర్లు పాలతో స్నానం.. అస్సాంలో ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) ఓ వ్యక్తి తన భార్యలకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. (Assam) అస్సాంలోని ముకల్మువా స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ (Manik Ali) భార్యతో విడాకులు తీసుకున్న ఆనందంలో దాదాపు నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు. ఈ రోజు నుండి నేను స్వేచ్ఛగా ఉంటాను అంటూ విడాకుల ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని పాలతో స్నానం చేశాడు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాణిక్ అలీ మీడియాతో మాట్లాడారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె రెండు సార్లు పారిపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ కుమార్తె కోసం పదే పదే క్షమించినట్లు వెల్లడించారు.

కానీ తన భార్య మారకపోవడంతో చట్టబద్ధంగా విడిపోయినట్లు తెలిపారు. బాధల నుంచి విముక్తి పొందిన తాను ఇప్పుడు తేలికగా ఫీలవుతున్నానని చెప్పారు. విడాకులు తీసుకున్న తర్వాత తను కొత్త జన్మను పొందిన ఫీల్ అవుతోందని అన్నారు. అందుకే కొత్త జీవితం ప్రారంభించడానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. విడాకులు తీసుకోవడం మంచి విషయమే.. కానీ ఇలా పాలను వేస్ట్ ఎందుకు చేస్తున్నావని పలువురు నెటిజన్ల కామెంట్స్ హైలెట్‌గా నిలిచాయి. ఎన్నో సంవత్సరాల భారాన్ని అతను తగ్గించుకున్నాడని అందుకే పాలతో స్నానం చేసినట్లు మరో నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.

పాలతో స్నానం వీడియో లింక్

Next Story