- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Elon Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం.. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా లాగిన్‌లో సమస్యలు
ఎక్స్ సేవల్లో మళ్లీ అంతరాయం ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘ఎక్స్’ సేవల్లో మళ్లీ అంతరాయం (X Down) ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని యూజర్లు లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇవాళ లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తాయి. సాంకేతిక సమస్యల కారణంగా లాగిన్ కోసం యూజర్ నేమ్ ఎంటర్ చేసి నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఎర్రర్ చూపింది. యూజర్స్ ఆర్ అనేబుల్ టు లాగిన్ నోటీస్ కనిపించింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ఈ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలను డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ కూడా ధృవీకరించింది. దాదాపు 83 శాతం మంది వినియోగదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కొంటుండగా 17 శాంత మంది వెబ్ సైట్ తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ నివేదించింది. కాగా ఎక్స్ సేవల్లో అంతరాయం ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది.






