Rahul Gandhi: కొత్త సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ విమర్శలు

by Shamantha N |

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియామకంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు.

Rahul Gandhi: కొత్త సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియామకంపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోడీ (PM Modi), హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)లు అర్ధరాత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘ఎన్నికల కమిషనర్‌ ఎంపికకు కమిటీ సమావేశంలో మోడీ, అమిత్‌షాలకు అభ్యంతరాల నివేదికను అందించాం. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్‌లో అత్యంత ప్రాథమిక అంశం సీఈసీ, ఈసీ ఎంపిక ఎంపిక ప్రక్రియ. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి వేళ కొత్త సీఈసీని ఎంపిక చేశారు. అర్ధరాత్రి వేళ అగౌరవ, అమర్యాదకర నిర్ణయం తీసుకున్నారు. ఇది మన ఎన్నికల ప్రక్రియపై కోట్లాది ప్రజల్లోని ఆందోళనలను తీవ్రతరం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకంపై సుప్రీంకోర్టులో 48 గంటల్లో విచారణ జరగనుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదు’ అని రాహుల్‌ రాసుకొచ్చారు.

జ్ఞానేశ్‌ కుమార్‌

భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేశ్‌ కుమార్, ఎలక్షన్‌ కమిషనర్‌గా వివేక్‌ జోషి నియమితులయ్యారు. మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ సూచించారు.

Next Story