ఖతార్ వేదికపై జాతీయజెండాకు అవమానం! బాలీవుడ్ నటి Norafatehiపై ట్రోల్స్ (వీడియో)

by Disha Web Desk |
ఖతార్ వేదికపై జాతీయజెండాకు అవమానం! బాలీవుడ్ నటి Norafatehiపై ట్రోల్స్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భారతదేశ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జైహింద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ భాగం కానప్పటికీ మన జెండా వరల్డ్ కప్ వేదికపై ఎగిసిపడింది. గురువారం రాత్రి నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫ్యాన్ ఈవెంట్ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో నోరా ఫతేహీకి ఓ అభిమాని జాతీయజెండాను ఇవ్వగా అది వేదికపై కింద పడింది. అనంతరం దానిని తీసుకున్న నటి జెండాను ప్రదర్శించింది. ముందు సరిగానే పట్టుకున్న నోరా ఫతేహి.. .తర్వాత జాతీయజెండాను రివర్స్(తలకిందులుగా) చేసి ప్రదర్శించింది. దీంతో, నెటిజన్లు నోరా ఫతేహిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

పొరుగు దేశంలో జాతీయ జెండాను అవమానించారని మండిపడుతున్నారు. జాతీయజెండా అంటే దేశ ప్రజలకు ప్రాణం లాంటిది. అటువంటి జెండాను ఏమాత్రం చూసుకోకుండా కింద పడేయడం ఏంటని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఖతార్ లో భారత్ భాగం కాకపోయినా జెండా ప్రదర్శించడంపై నటిపై ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లుకొడుతున్నాయి. కాగా, త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న నోరా.. జైహింద్ అనాలంటూ ప్రేక్షకులను పిలుపునిచ్చింది. ఎవరైనా జైహింద్ అంటారా? అని అడిగింది. దీంతో భారత అభిమానులంతా జైహింద్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాకుండా జెండాను భుజంపై వేసుకుని ఎగరేసింది.

Next Story

Most Viewed