Shashi Tharoor: కొలంబియా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన శశిథరూర్

by Shamantha N |

కొలంబియా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలిపింది.

Shashi Tharoor: కొలంబియా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొలంబియా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలిపింది. దీనిపైనే శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. శశిథరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తుంది.కాగా.. ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి తెలపకుండా.. భారత్‌ దాడుల తర్వాత పాక్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంతో నిరాశ చెందాం. మా ఆత్మరక్షణ హక్కును మాత్రమే మే వినియోగించుకున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌కు దారితీసిన పరిస్థితులను గురించి కొలంబియా అధికారులతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశం కూడా అనేక ఉగ్రదాడులను చూసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్‌ అనేక దాడులను భరించింది. పాకిస్థాన్‌ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి కోసం వాడుతోంది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే మా విధానాలు ఉంటాయి’ అని థరూర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా పెహల్గాం దాడి వెనక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయన్నారు. అంతేకాకుండా, పాక్ లోని మొత్తం రక్షణ పరికరాల్లో 81 శాతం చైనా నుంచి అందుతున్నవే అని తెలిపారు.

పహెల్గాం ఉగ్రదాడి..

పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు చేపట్టారు. ఈ దాడిలో 26 మంది అమాకులు బలయ్యారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే, ఈ దాడిలో 170 మందికిపైగా ముష్కరులు చనిపోయారు. దీనికి పాక్‌ సైన్యం స్పందించి.. మనపై ప్రతిదాడులకు దిగింది. వాటిని మన బలగాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయయి. కాగా.. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది.

Next Story