- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Indian Coast Guard : గుండెపోటుతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ డీజీ రాకేశ్‌పాల్ కన్నుమూత
Indian Coast Guard : గుండెపోటుతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ డీజీ రాకేశ్‌పాల్ కన్నుమూత
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. వాస్తవానికి ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆదివారం ఉదయం చెన్నైలో జరిగిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ సదస్సులో పాల్గొనాల్సి అయింది. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ సదస్సులో పాల్గొనలేనని సంబంధిత ఉన్నతాధికారులకు రాకేశ్ పాల్ సమాచారాన్నిఅందించారు.
ఆరోగ్యం విషమించడంతో ఆయనను హుటాహుటిన చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. రాకేశ్ పాల్ ఆకస్మిక మరణంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆయనొక నిబద్ధత కలిగిన అధికారి. ఆయన సారథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చాలా బలోపేతమైంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. రాకేశ్ పాల్ భౌతిక కాయాన్ని రక్షణమంత్రి సందర్శించి నివాళులర్పించారు.
Next Story






