ఢిల్లీ నుంచి షాంఘైకి నేరుగా..! కరోనా తర్వాత నేడు విమాన సర్వీస్‌లు మళ్లీ ప్రారంభం

by Ramesh Naini |

ఢిల్లీ నుంచి షాంఘై విమాన సర్వీసులు ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి.

ఢిల్లీ నుంచి షాంఘైకి నేరుగా..! కరోనా తర్వాత నేడు విమాన సర్వీస్‌లు మళ్లీ ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి షాంఘై విమాన సర్వీసులు ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి. చైనా ఈస్టర్న్‌ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరుతుంది. రేపు తెల్లవారుజామున షాంఘై చేరుకుంటుంది. వారానికి మూడు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఇండిగో సంస్థ కోల్‌కత్తా నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి విమాన సర్వీసులను ప్రారంభించింది. కరోనా, గల్వాన్‌ సరిహద్దులో ఘర్షణ కారణంగా 2020 నుంచి భారత్ చైనా మధ్య విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో విమాన సర్వీస్‌లను పునరుద్ధరించారు. సీనియర్ చైనా కాన్సులర్ అధికారి క్విన్ యోంగ్ మాట్లాడుతూ.. విమానాల పునఃప్రారంభం ‘భారత్-చైనా సంబంధానికి చాలా ముఖ్యమైన రోజు’ అని తెలిపారు. భారత్–చైనా బంధానికి కొత్త ఆరంభం అని మరోవైపు నిపుణులు చెబుతున్నారు.

Next Story