Dilawar: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణం.. రాజస్థాన్ మంత్రి దిలావర్

by vinod kumar |
Dilawar: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణం.. రాజస్థాన్ మంత్రి దిలావర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోచింగ్ హబ్‌గా పేరు పొందిన రాజస్థాన్‌లోని కోటా (Kota) నగరంలో నీట్, జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ (Madan dilawar) సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే ప్రధాన కారణమని చెప్పారు. ఈ రీజన్ వల్లే ఎక్కువ మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారన్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. చదువు విషయంలో వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న వేళ మదన్ దిలావర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, కోటాలో ఈ ఏడాది ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోగా.. 2023లో 26 మంది, 2024లో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Next Story