- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Congress: కాంగ్రెస్ ఏనాడో ముస్లిం అధ్యక్షులను నియమించింది: దిగ్విజయ్ సింగ్

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింలపై ప్రేమ చూపించే కాంగ్రెస్, అధ్యక్షుడి పదవికి ముస్లింలను ఎందుకు ఎన్నుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమకు సలహాలిచ్చే బీజేపీ ముందుగా తన పార్టీ అధ్యక్షుడిగా ముస్లింను నియమించాలని సవాలు విసిరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ గతంలో అనేక సందర్భాల్లో ముస్లింలను కీలక పదవులు అప్పగించిందన్నారు. బీజేపీ మైనారిటీ వర్గాలను శత్రువులుగా పరిగణిస్తోందని, కేంద్రంలో, రాష్ట్రాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు అనవసరంగా ఇరికిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. దేశంలో 'కలకలం సృష్టించే ధోరణి' కనిపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ఇంతకుముందు ముస్లింలు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అందుకు తాము గర్వంగా భావిస్తున్నాం. ముస్లింలపై దయ చూపించాలనుకునే బీజేపీ, ఎందుకని ముస్లిం వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవట్లేదని డిగ్గీ ప్రశ్నించారు. స్వాతంత్ర్యానికి పూర్వం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ముఖ్తార్ అహ్మద్ అన్సారీ, సయ్యద్ హసన్ ఇమామ్, నవాబ్ సయ్యద్ మహమ్మద్ బహదూర్ లాంటి ప్రముఖ ముస్లిం నేతలు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. దేశంలో మైనారిటీ వర్గాలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ శత్రువులుగా పరిగణిస్తున్నాయి. వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ నిబంధనలను విస్మరిస్తున్నారు.