- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ ఆయుధాలతో.. రక్తం కక్కుతూ కూలిపోయిన వెనిజులా సైనికులు!
వెనిజులాపై అమెరికా సోనిక్ ఆయుధాలు వాడిందని తెలుస్తోంది. దీంతో అక్కడి సైనికులు రక్తం కక్కుతూ నేలకూలారని సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్ సమయంలో యూఎస్ దళాలు సోనిక్ ఆయుధాలు వాడారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని శక్తిమంతమైన ఈ ఆయుధాల వల్ల వెనిజులా సైనికులు నిశ్చేష్టులై పోయారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక వెనిజులా సైనికుడు ఈ వివరాలు వెల్లడించిన వార్తా కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ షేర్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే వెనిజులా దళాలను అమెరికా సైన్యం నిస్సహాయులను చేసిందని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆయుధాలతో రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని సదరు వ్యక్తి తెలియజేశాడు. ‘మేం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ సడెన్‌గా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం మానేశాయి. ఆ మరుక్షణమే భారీ సంఖ్యలో డ్రోన్స్ వచ్చేశాయి. ఏం చేయాలో కూడా మాకు తెలియలేదు’ అని ఒక గార్డు చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది.
వందల సంఖ్యలో ఉన్నప్పటికీ తాము ఏం చేయలేకపోయామని సదరు వెనిజులా గార్డ్ చెప్పారట. అసలు అది పోరాటంలా కాకుండా.. ఏకపక్షంగా చేసిన దండయాత్రలా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఈ పోరాటం జరుగుతున్నప్పుడే అమెరికా సైనికులు ఏదో ఆయుధం ఉపయోగించారని, దాన్ని వర్ణించడం కష్టమని చెప్పిన ఆ వెనిజులా సైనికుడు.. ఒక తీవ్రమైన శబ్దం వినిపిచందని, తల పగిలిపోతుందనిపించిందని వివరించాడు. ఆ ఆయుధం వాడిన తర్వాత తమ సైనికుల్లో చాలామంది ముక్కుల వెంట రక్తం కారడం మొదలైందని, రక్తం కక్కడం మొదలుపెట్టారని, కింద పడి కనీసం కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయామని ఆ సైనికుడు చెప్పాడు. ఆ ‘సోనిక్ ఆయుధం’ ఉపయోగించిన తర్వాత తాము నిలబడలేకపోయామన్నాడు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం నిర్ధారించలేదు. అయితే ప్రెస్ సెక్రెటరీ ఈ పోస్టును షేర్ చేయడంతో.. అమెరికా వద్ద సోనిక్ ఆయుధాలు ఉన్నాయనే వాదనకు బలం చేకూరుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.






