Bashar al-Assad : సిరియా అధ్యక్షుడి విమానం కూల్చివేత?

by Sathputhe Rajesh |

సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోగా ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ రాజధాని వీడి విమానంలో గుర్తు తెలియని చోటుకి వెళ్లిపోయారు.

Bashar al-Assad : సిరియా అధ్యక్షుడి విమానం కూల్చివేత?
X

దిశ, నేషనల్ బ్యూరో : సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్స్ స్వాధీనం చేసుకోగా ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ రాజధాని వీడి విమానంలో గుర్తు తెలియని చోటుకి వెళ్లిపోయారు. అయితే తాజాగా అసద్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈజిప్ట్ రచయిత ఖలీద్ మమమూద్ ‘ఎక్స్’ ఈ వేదికగా ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 ఎత్తుకు పడిపోయినట్లు తెలిపారు. ఉత్తర అఖర్ ప్రాంతంలో లెబనీస్ ఎయిర్ స్పెస్ అవతల ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. త్రీడి రాడర్ డేటా ఫైట్ క్రాష్ అయినట్లు సూచించిందన్నారు. విమానాన్ని కూల్చి ఉంటారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ వర్గాలు ధృవీకరించలేదు. సిరియా ఆర్మీ కమాండ్ ప్రెసిడెంట్ బషర్-అల్-రషీద్ పాలన ముగిసినట్లు ప్రకటించారు.

Next Story