- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధ్రువ్-ఎన్‌జీ సేవలు షురూ.. ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
సివిల్ ఏవియేషన్ మార్కెట్‌లో మరో విప్లవాత్మక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సివిల్ ఏవియేషన్ మార్కెట్‌లో మరో విప్లవాత్మక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) హెలికాప్టర్ డివిజన్‌లో ధ్రువ్-ఎన్‌జీ (Dhruv-NG) నెక్స్ట్ జెనరేషన్ సివిల్ హెలికాప్టర్‌కు ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ముందుగా ఆయన హెలికాప్టర్‌లో పైలట్‌తో కలిసి కాక్‌పిట్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ను స్వయంగా పరిశీలించారు. HAL రూపొందించిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ధ్రువ్ ఇప్పటి వరకు సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగించగా.. తాజాగా దాని నెక్ట్స్-జెనరేషన్ వెర్షన్‌ను సివిల్ ఆపరేటర్ల అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ భారతదేశంలోని పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు వంటి కఠిన పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగలదు. హై-ఆల్టిట్యూడ్, హాట్ అండ్ హై పరిస్థితుల్లో కూడా బాగా పనిచేసే సామర్థ్యం ఉంది. సివిల్ ఏవియేషన్ మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ధ్రువ్-ఎన్‌జీ సేవలు కొనసాగనున్నాయి.






