- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మస్థలిలో మరో షాకింగ్ ఘటన.. మిస్టీరియస్ మర్డర్స్ రికార్డ్స్ డిలీట్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్ కేసు(Dharmasthala mass Burial Case) ఘటనలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్ కేసు(Dharmasthala mass Burial Case) ఘటనలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధర్మస్థలిలో గత 15 ఏళ్లుగా నమోదైన మిస్టీరియస్ డెత్ కేసుల రికార్డ్స్ మాయం అయ్యాయి. ఓ RTI కార్యకర్త అడిగిన వివరాలు మేరకు ఈ నిజం బయటికి వచ్చింది. 2000 నుంచి 2015 వరకు నమోదైన వందలాది మిస్టీరియస్ డెత్ కేసులను రికార్డ్స్ నుంచి పూర్తిగా తీసివేశారని తెలుస్తోంది. ఆర్టీఐ కార్యకర్త సిట్ కు పలు కీలక సమాచారం అందించారు. తానూ ఎంతోకాలంగా ఇక్కడ మిస్సింగ్ కేసుల వివరాలను తెల్సుకుంటున్నానని, అయితే గతంలో అసహజంగా మరణించిన ఒక యువతి శవాన్ని తన కళ్ళముందే దారుణంగా పాతిపెట్టడం చూశానని, ఆ సమయంలో అధికారులు కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నాడు.
గత 15 ఏళ్లలో నమోదైన అసహజ మరణాల కేసుల వివరాలను తాను కోరగా అవన్నీ పరిపాలన పరమైన ఆదేశాల మేరకు నాశనం చేసినట్టు చెప్పారన్నారు. కాగా ధర్మస్థలిలోని మంజునాథ ఆలయంలో పనిచేసే ఓ పారిశుద్ధ కార్మికుడు తాను గతంలో వందలాది అసహజంగా మరణించిన వారి శవాలను నేత్రావతి నది ఒడ్డున పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్ సంచలనం రేపాయి. ఈ మర్డర్స్ పై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అస్థిపంజరాలు వెలికితీత పనులు జరుగుతున్నాయి.






