- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరుభూమిగా మారిన సుందర ధరాలి.. సముద్రమే మీద పడిందా అన్నట్లుగా..
ఎంతో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం.. మెరుపు బురద వరదలకు మరుభూమిగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎంతో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం.. మెరుపు బురద వరదలకు మరుభూమిగా మారింది. సముద్రం వచ్చి మీద పడిందా అన్నట్లుగా సంభవించిన మెరుపు వరదల వీడియోలు చూస్తుంటే హృదయం చలించిపోతుంది. ఏకధాటిగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కురిసిన వర్షానికి నీరు, మట్టి కలిసి సంభవించిన వరదల్లో అనేక మంది మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఎక్కువగా చార్ ధామ్ యాత్రికులు వెళ్తుంటారు. యాపిల్స్ కు ప్రసిద్ధి చెందిన హర్సిల్ లోయకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి అతి సమీపం నుంచే భాగీరథి నది ప్రవహిస్తోంది.
రిషికేశ్ నుంచి బయల్దేరి చంబా, ఉత్తరకాశీ, హర్సిల్ మీదుగా ధరాలికి వెళ్లవచ్చు. సముద్ర మట్టానికి సుమారు 2,680 మీటర్ల ఎత్తులో ఉంది ఈ ప్రదేశం. ఇక్కడి నుంచి గంగోత్రి ధామ్ (Gangotri Dham) 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంగోత్రికి వెళ్లే సమయంలో యాత్రికులు ఎంతో సుందరంగా ప్రశాంతంగా ఉండే ధరాలీ (Dharali) ప్రాంతంలో రెస్ట్ తీసుకునేందుకు ఇష్టపడతారు.
కాగా.. ధరాలీ గ్రామంలో వరదలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. భారీ వరదల్లో సుమారు 60 మంది గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు ఆగస్టు 10వ తేదీ వరకూ ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ధరాలీలో మెరుపు వరదలు సంభవించిన ప్రాంతంలో 20-25 హోటళ్లు, హోమ్ స్టేలు కొట్టుకుపోయాయి.






