Dhan Dhyan: పీఎం ధన్ ధ్యాన్ కృషి యోజన.. కొత్త పథకంతో ప్రయోజనాలు వారికే?

by B.Srinivas |

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల కోసం పీఎం ‘ధన్ ధ్యాన్ కృషి యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు.

Dhan Dhyan: పీఎం ధన్ ధ్యాన్ కృషి యోజన.. కొత్త పథకంతో ప్రయోజనాలు వారికే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రైతుల కోసం పీఎం ‘ధన్ ధ్యాన్ కృషి యోజన’ (Dhan dhyan krishi yojana) అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశంలోని కోటి మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం కలగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ధన్ ధ్యాన్ కృషి యోజన అంటే ఏమిటి? ఆ స్కిమ్ ఎలా ఉపయోగపడుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం. తక్కువ-పంటల ఉత్పాదకత కలిగిన ప్రాంతాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. రాష్ట్రాల సహకారంతో ఈ పథకం అమలు కానుండగా దీనితో ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు సహాయం అందనుంది. దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఉత్పాదకతను పెంపొందించడానికి, వ్యవసాయాన్ని వైవిధ్యపరచడానికి, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, పంటకోత అనంతరం నిల్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు సీతారామన్ ప్రకటించారు.

Next Story