చార్ ధామ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-31 05:16:09  IST  )

చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. జోషీమఠ్-మార్వారీ మార్గంలో 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

చార్ ధామ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. జోషీమఠ్-మార్వారీ మార్గంలో 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్, సెలవు దినాలు కావడంతో కేదార్ నాథ్, గోవింద్ ఘాట్స్, జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ మార్గం అదే విధంగా కేదార్ నాథ్ వెళ్లే సోన్ ప్రయాగ్ లాంటి మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహ‌నాలు బారులు తీర‌డంతో యాత్రికులు గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సి వ‌స్తోంది. స‌రైన ఆహారం, నీళ్లు వ‌స‌తులు లేక ఇబ్బంది ప‌డుతున్నారు.

దీంతో అధికారులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుఉ ప్ర‌య‌త్నిస్తున్నారు. ట్రాఫిక్ ను నియంత్రించేందు పోలీసులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌టంతో చార్ ధామ్ వెళ్లే భక్తులు ముందుగానే ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు తెలుసుకుని ప్ర‌యాణాన్ని ప్లాన్ చేసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే చార్ ధామ్ యాత్ర హిందూ మ‌తంలోని ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రాల ప్ర‌యాణం అని చెబుతుంటారు. చార్ ధామ్ అంటే హిమాల‌యాల్లోని నాలుగు ప‌విత్ర స్థ‌లాల‌ను ద‌ర్శించుకోవ‌డం అని అర్థం. ప్ర‌తి ఏడాది ఏప్రిల్ చివ‌రి వారం లేదా మే మొద‌టివారంలో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. అక్టోబ‌ర్ చివ‌ర‌లో లేదా న‌వంబ‌ర్ లో పూర్త‌వుతుంది.

Next Story