- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arunachalam Temple : అరుణాచలం ఆలయంలో తన్నుకున్న ఏపీ, కర్ణాటక భక్తులు
తమిళనాడులో(Tamilanadu)ని తిరువణ్ణామలై(Tiruvannamalai) ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయం(Arunachalam Temple)లో ఏపీ, కర్ణాటక భక్తులు తన్నుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో(Tamilanadu)ని తిరువణ్ణామలై(Tiruvannamalai) ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయం(Arunachalam Temple)లో ఏపీ, కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. నేటి ఉదయం పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక భక్తుల మధ్య క్యూలైన్‌లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ గొడవ వల్ల భక్తుల రద్దీ కారణంగా 3 కిలోమీటర్ల పొడవైన క్యూలైన్ ఏర్పడింది.
స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాల భక్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలయంలో భద్రత, రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో చర్చకు దారితీసింది.






