అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు

by Ajay Maddhiboyina |

అమ‌ర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందికిపైగా దేవుడిని దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు.

అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు
X

దిశ, వెడ్ డెస్క్: అమ‌ర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందికిపైగా దేవుడిని దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు. జూలై 2న యాత్ర ప్రారంభం కాగా ఆనాటి నుండి జూలై 21వ తేదీ వరకు అంటే 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శిచుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది యాత్ర ముగిసే నాటికి మొత్తం దాదాపు 5 లక్షల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తరవాత అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్మూ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అమర్ నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుండి కాలినడకన లేదా పోలీల సాయంతో ఆలయం వద్దకు చేరకుంటున్నారు. జూలై 2న యాత్ర ప్రారంభం కాగా 38 రోజుల పాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజు ముగియనుంది.

Next Story