Shabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు

by Muthe.Rajitha |   (  Updated:2024-11-24 17:33:03  IST  )

కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప(Shabarimala Ayyappa) ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Shabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప(Shabarimala Ayyappa) ఆలయానికి భక్తులు పోటెత్తారు. నవంబర్ 16న రోజున మండల-మకరవిలుక్కు సీజన్ మొదలుతో ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ 9 రోజుల్లోనే 6 లక్షలకు పైగా భక్తులు అయ్యప్పను దర్శించకున్నట్టు టీబీడీ(TBD) బోర్డ్ పేర్కొంది. ప్రస్తుతానికి నిముషానికి 80 మండి భక్తులు ఆలయంలోని పవిత్ర మెట్లను ఎక్కుతున్నారని తెలిపింది. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. పలు కేంద్రాల్లో ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఆలయ పరిసరాలను, నదులను కలుషితం చేయరాదని.. వాటిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి భక్తుడు బాధ్యత అని బోర్డ్ తెలియ జేసింది.

Next Story