Modi కన్నా దేవెగౌడ పెద్ద నాయకుడు... జేడీఎస్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

by S Gopi |   (  Updated:2022-12-15 10:53:56  IST  )

జనతా దళ్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని...Devegowda bigger leader than Narendra Modi, claims JD(S) chief

Modi కన్నా దేవెగౌడ పెద్ద నాయకుడు... జేడీఎస్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
X

బెంగళూరు: జనతా దళ్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కన్నా మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెద్ద నాయకుడని అన్నారు. గుజరాత్ లో మోడీ ఎంతటి నాయకుడో కర్ణాటకలో దేవెగౌడ కూడా అంతే అని పేర్కొన్నారు. ఆయన మట్టి పుత్రుడని అన్నారు. కర్ణాటకలో జేడీ(ఎస్) అధికారంలోకి వస్తుందని అన్నారు. యడియూరప్ప ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు కాదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎం అయ్యారని ఆరోపించారు. తాజాగా మోడీ, దేవెగౌడ ఇద్దరూ కర్ణాటక అభివృద్ధి అంశంపై చర్చలు జరిపిన తరుణంలో ఈ వ్యాఖ్యలు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Also Read...

తాగితే చస్తారు.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు

Next Story