Shakti Dubey : సివిల్స్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్ శక్తి దూబె వివరాలివే

by Muthe.Rajitha |

మంగళవారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష 2024(CSE 2024) తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

Shakti Dubey : సివిల్స్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్ శక్తి దూబె వివరాలివే
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం సివిల్స్ సర్వీసెస్ పరీక్ష 2024(CSE 2024) తుది ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో శక్తి దూబె(Shakti Dubey) ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అయితే 1,056 పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన పరీక్షలో దేశం మొత్తం మీద వేలమంది పోటీ పడగా.. అందులో తుది వరకు 1,009 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ వరకు నిలిచారు. వీరిలో శక్తి దూబె అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayag Raj) లో జన్మించిన శక్తి అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది.

అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి ఆమె సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్టులను శక్తి మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్స్ గా ఎంచుకున్నారు. తండ్రి పోలీసు సర్వీసులో ఉద్యోగి కావడంతో తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు. కాగా శక్తి దూబే విజయాన్ని తల్లిదండ్రులతోపాటు స్నేహితులు సెలెబ్రేట్ చేసుకున్నారు.

Next Story