Congress MPs: మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన

by Shamantha N |

అదానీ వ్యవహారంపై(Adani Issue) విచారణ జరిపించాలని పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు(Congress MPs) వినూత్న నిరసన చేపట్టారు.

Congress MPs: మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ వ్యవహారంపై(Adani Issue) విచారణ జరిపించాలని పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు(Congress MPs) వినూత్న నిరసన చేపట్టారు. అదానీ, మోడీ మాస్కులు ధరించి డ్రామా ప్లే చేశారు. . కాంగ్రెస్ ఎంపీలు మాణిక్కం ఠాగూర్(Manickam Tagore), సప్తగిరి శంకర్ ఉలక(Saptagiri Sankar Ulaka).. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), గౌతమ్ అదానీ(Gautam Adani) మాస్కులు ధరించారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi,) వారి ఫొటోలు తీస్తూ మీ మధ్య ఉన్నం సంబంధాన్ని వివరించండి అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. "హమ్ దోనో మిల్కే సబ్ కరేంగే (అన్నీ కలిసి చేస్తాం). మాకు చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి" అని మోడీ, అదానీ మాస్కుల్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. తమ వల్ల పార్లమెంట్‌ కార్యకలాపాలు ఎందుకు ఆగిపోయాయని రాహుల్‌గాంధీ మరో ప్రశ్న అడిగారు. “ ఇవాళ అమిత్ భాయ్(కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఉద్దేశిస్తూ) అదృశ్యమయ్యారు.సభకు రాలేదు” అని జవాబిచ్చారు. ఇకపోతే, ప్రధాని మాస్క్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీని చూపిస్తూ.. ‘నేను ఏది చెబితే అది చేస్తాడు’ అని అదానీ మాస్క్ తో ఉన్న మరో ఎంపీ అన్నారు.

వాయిదాల పర్వం

ఇకపోతే, పార్లమెంటు శీతాకాల సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి వాయిదాల పర్వం కొనసాగుతోంది. గౌతమ్ అదానీపై నమోదైన కేసు విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ లో నిరసనలు వ్యక్తం చేశారు. జాయింట్ పార్లమెంటరీ విచారణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు బయట "మోడీ, అదానీ ఏక్ హై", "మాకు న్యాయం కావాలి" వంటి నినాదాలు చేశారు.

Next Story