- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deportation: దేశంలో అక్రమ నివాసం..15 మంది విదేశీయులను బహిష్కరించిన భారత్ !
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులపై నిరంతర చర్యలు కొనసాగుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులపై నిరంతర చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వీసా వ్యాలిడిటీ (Visa validity) ముగిసినప్పటికీ భారత్‌లో అక్రమంగా ఉంటున్న 15 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ గార్డెన్, ఉత్తమ్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు బంగ్లాదేశీయులు (Bangladeshis), 12 మంది నైజీరియన్లు (Nigerians), ఐవరీ కోస్ట్ (Ivory Coast) కు చెందిన ఒక పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చెల్లుబాటు అయ్యే వీసాలు లేకుండా భారత్‌లో నివసిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం వారిని నిర్భంధ కేంద్రానికి పంపించగా వారి ఐడెంటిటీని ధ్రువీకరించిన తర్వాత ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అనంతరం వారిని స్వదేశాలకు పంపించినట్టు అధికారులు తెలిపారు.
కాగా, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో భాగంగా బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి వారు దేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేసే నెట్ వర్క్‌లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని తెలిపారు. దీంతో దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించడానికి పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు.






