- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
West Bengal: బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని సీనియర్ యాక్టర్, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ముర్షిదాబాద్ హింసపై బెంగాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని సీనియర్ యాక్టర్, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ముర్షిదాబాద్ హింసపై బెంగాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం విఫలమైంది కాబట్టే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ఓ మీడియాతో అన్నారు. “బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(President Rule) విధించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా. ఇప్పటికీ కేంద్ర హోం శాఖను అదే కోరుతున్నా. కనీసం ఇప్పుడైనా స్పందించి సైన్యాన్ని దించండి. అప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’ అని అన్నారు. కాగా.. వక్ఫ్ చట్టాన్ని(Waqf Bill) వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లపై స్పందించిన ఆయన.. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, వచ్చే ఏడాదిలో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేగుతున్నాయి.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా..
ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో భారీగా కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చింది. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించొద్దన్న సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. మాల్దా క్యాంప్‌లలో ఉన్న బాధిత కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహాట్కర్ నేతృత్వంలోని బృందం సైతం రిలీఫ్ క్యాంప్‌లలో పర్యటించింది.






