- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణతంత్ర వేడుకల్లో ‘ఎస్-400’ శకటం.. ఆపరేషన్ సిందూర్ గుర్తుచేస్తూ..
ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను గుర్తుచేస్తూ.. గణతంత్ర పరేడ్‌లో ‘ఎస్-400’ శకటం ప్రదర్శించనున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తలపించే శకటాన్ని ప్రదర్శించనున్నారు. గతేడాది ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్ యుద్ధ విమానాలను కూల్చిన ఈ వ్యవస్థను ప్రదర్శిస్తున్నట్లు ఎయిర్ కామడోర్ మనీష్ సబర్వాల్ వెల్లడించారు. ఈ గణతంత్ర వేడుకల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఆధ్వర్యంలో ‘ట్రై సర్వీసెస్ శకటం - ఆపరేషన్ సిందూర్’ను ప్రదర్శిస్తోంది. మొత్తం 6,050 మంది మిలిటరీ అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొంటున్నారని మేజర్ జనరల్ నవరాజ్ ధిల్లాన్ తెలిపారు. ఈ పరేడ్‌కు వరుసగా నాలుగోసారి లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై ఎస్-400 వ్యవస్థతోపాటు భైరవ్, శక్తిబాన్, యూజీవీ, ఏటీఏజీఎస్ తదితర మిసైల్స్‌ను చూపిస్తూ దేశ మిలిటరీ శక్తిని ప్రదర్శించనున్నట్లు మేజనర్ జనరల్ ధిల్లాన్ ప్రకటించారు. కాగా, సోమవారం జరిగే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం 30 శకటాలను ప్రదర్శించనున్నారు. వీటిలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వస్తుండగా.. మిగతా 13 వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, సర్వీస్‌లు ప్రదర్శించనున్నాయి.






