ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు: ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’.. అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ!

by Malleboina Mahesh |

ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని చోట్ల సున్నాకి పడిపోయింది.

ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు: ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’.. అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ!
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని చోట్ల సున్నాకి పడిపోయింది. ఈ తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పొగమంచు ప్రభావంతో దేశ రాజధానిలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు కనీసం 50 మీటర్ల దూరాన్ని కూడా చూడలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి.

కేవలం పొగమంచే కాకుండా, ఢిల్లీలో వాయు కాలుష్యం (AQI) కూడా ‘తీవ్ర’ స్థాయికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం GRAP Stage IV ఆంక్షలను అమలు చేస్తోంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు మూసివేసి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, కార్యాలయాల్లో 50 శాతం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు తప్ప మిగిలిన భారీ వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story