- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ బాధితులతో గంటలు గడిపిన ట్రంప్!
ఎప్‌స్టీన్ బాధితులతో గంటలు గడిపిన ట్రంప్. ఎప్‌స్టీన్ ఈమెయిల్స్‌లో వెలుగు చూసిన షాకింగ్ విషయాలు.

దిశ, నేషనల్ బ్యూరో: జెఫ్రీ ఎప్‌స్టీన్ చేసిన దారుణాలు అన్నీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు తెలుసునని అమెరికాలోని డెమోక్రాట్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ పార్టీకి చెందిన నేతలు.. ఎప్‌స్టీన్ రాసిన కొన్ని మెయిల్స్‌ను విడుదల చేశారు. తన సహచరుడు గిజలైన్ మ్యాక్స్‌వెల్, రచయిత మైఖేల్ వుల్ఫ్‌కు రాసిన మెయిల్స్‌లో ట్రంప్ పేరును ఎప్‌స్టీన్ ప్రస్తావించినట్లు డెమోక్రాట్లు చెప్తున్నారు. మ్యాక్స్‌వెల్‌కు రాసిన మెయిల్‌లో ‘ఇప్పటి వరకు బయటకు రాని పేరు ట్రంప్‌దే. ఆమె మా ఇంట్లో ట్రంప్‌తో గంటల తరబడి గడిపింది. కానీ ట్రంప్ పేరు మాత్రం ప్రస్తావించలేదు’ అని ఎప్‌స్టీన్ ఆరోపించారు. దీనికి బదులిచ్చిన మ్యాక్స్‌వెల్ తను కూడా అదే విషయంలో ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు.
అలాగే తను చేసే అమ్మాయిల వ్యాపారం గురించి ట్రంప్‌కు పూర్తిగా తెలుసునంటూ రచయిత వుల్ఫ్‌కు రాసిన మెయిల్‌లో పేర్కొన్నారు. వీటిని చూసిన తర్వాత ఎప్‌స్టీన్ నేరాల్లో ట్రంప్ పాత్రపై అనుమానలు తలెత్తుతున్నాయని హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమోక్రాట్ నేతలు అంటున్నారు. అయితే డెమోక్రాట్లు కావాలనే అబద్ధాలతో ప్రెసిడెంట్ ట్రంప్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైట్‌హౌస్ మండిపడింది. కాగా, ఎప్‌స్టీన్ విషయంలో ఇక దర్యాప్తు చేసేదేం లేదంటూ నాలుగు నెలల క్రితమే ట్రంప్ సర్కారు ఈ ఇన్వెస్టిగేషన్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే. గతంలో తన మిత్రుడైన ఎప్‌స్టీన్ చేసిన ఘోరాల గురించి తనకేం తెలియదని ట్రంప్ చెప్పారు. ఈ కేసులో ఆయనపై ఎలాంటి కేసులు కూడా నమోదవలేదు.






