- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lt Governor: ఢిల్లీ ఎల్జీపై కేసులు వెనక్కి తీసుకునేందుకు బీజేపీ సర్కారు రెడీ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కేసులు వెనక్కి తీసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. గతంలోని ఆప్ సర్కారుకు, ఎల్జీకి మధ్య వివాదాలతో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కేసులు వెనక్కి తీసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. గతంలోని ఆప్ సర్కారుకు, ఎల్జీకి మధ్య వివాదాలతో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. వాటిని ఉపసంహరించేందుకు కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (DERC) చైర్మన్, ఢిల్లీ జల్ బోర్డుకు నిధులు, అల్లర్ల కేసుల్లో న్యాయవాదుల నియామకం, విదేశాలలో ఉపాధ్యాయ శిక్షణ, యమునా నది కాలుష్యంపై ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించిన కేసులే ఉన్నాయి. ఆప్ అధికారంలో ఉన్నప్పుడు, ఢిల్లీ ప్రభుత్వలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తరచూ ఘర్షణ పడ్డారు.ఈ విభేదాల్లో అనేక కేసులో కోర్టుల్లోనే ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ (LG) ఉద్దేశపూర్వకంగా తన విధానాల అమలును అడ్డుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్, ఆతిషీ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు, ఆప్ తనకు సహకరించలేదని ఎల్జీ ప్రత్యారోపణలు చేశారు. మరోవైపు, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 48 స్థానాలను గెలుచుకున్న బీజేపీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆప్‌లోని కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు






