- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video: ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ శ్రీనగర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 220 మంది ప్రయాణికులతో వెళుతున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర అల్లకల్లోలానికి గురైంది.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ శ్రీనగర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 220 మంది ప్రయాణికులతో వెళుతున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర అల్లకల్లోలానికి గురైంది. దీంతో పైలట్ శ్రీనగర్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం తీవ్రంగా అతలాకుతలం అవ్వడంతో ప్రయాణికులు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులు భయంతో తమ సీట్లను గట్టిగా పట్టుకున్నారు. క్యాబిన్ అస్తవ్యస్తంగా కనిపించింది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో విమానం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సాయంత్రం 6.30 నిమిషాలకు సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం ముందు భాగంలో కొంత డ్యామేజ్ కూడా జరిగింది. కానీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.






