Delhi Election results: ఇంకా కొట్టుకోండి.. ఆప్, కాంగ్రెస్ పై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

by Shamantha N |

‘ఇంకా కొట్టుకోండి.. మీలో మీరే పోట్లాడుకోండి’ అంటూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు.

Delhi Election results: ఇంకా కొట్టుకోండి.. ఆప్, కాంగ్రెస్ పై ఒమర్ అబ్దుల్లా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఇంకా కొట్టుకోండి.. మీలో మీరే పోట్లాడుకోండి’ అంటూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Election results) ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే బీజేపీ(BJP) విజయకేతనం ఎగురవేసింది. అయితే, దీనిపైనే స్పందిస్తూ అధికార ఆమ్‌ఆద్మీ (AAP),కాంగ్రెస్‌ (Congress) పార్టీ లకు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) చురకలు అంటించారు. ఢిల్లీలో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ సహకరించలేదని, అందువల్లే ఎన్నికల ఫలితాల్లో వెనకబడిపోయారని మండిపడ్డారు. ఇంకా కొట్టకోండి అంటూ ఇరు పార్టీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇండియా కూటమి

ఢిల్లీ ఎన్నికల విషయంలో ‘ఇండియా’ కూటమిలో భాగమైన కాంగ్రెస్ (Congress), ఆమ్‌ఆద్మీ పార్టీల (AAP) మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇరుపార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారాల సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆప్‌పై లిక్కర్ స్కాం సహా పలు ఆరోపణలు చేశారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ ఆప్‌ సహా కూటమి నేతలు అసహనం వ్యక్తంచేశారు. దీనివల్ల ఆగ్రహానికి గురైన ఒమర్‌అబ్దుల్లా కలసికట్టుగా లేకపోతే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని మండిపడ్డారు.

Next Story