- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్ల తర్వాత ఢిల్లీలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు.. గాలినాణ్యతలో మెరుగుదల
ఢిల్లీలో రెండేళ్ల తర్వాత తొలిసారి అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు ఐఎండీ డేటా తెలిపింది. ఈనెల 23వ తేదీ గురువారం..

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో వాయుకాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టపగలే పొగమంచు కురుస్తుందా అన్న రీతిలో వాయుకాలుష్యం కనిపిస్తుంది. అలాంటి ఢిల్లీలో రెండేళ్ల తర్వాత తొలిసారి అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు ఐఎండీ డేటా తెలిపింది. ఈనెల 23వ తేదీ గురువారం రాత్రి సమయంలో ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలో సాధారణం కంటే 0.2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదయినట్లు వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఢిల్లీలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత అని ఐఎండీ (IMD) చెప్పింది. 2024 అక్టోబర్ 15న ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 17.4 డిగ్రీల సెల్సియస్ గా ఉందని ఐఎండీ డేటా వెల్లడించింది.
దీనితోపాటు నగరంలో గాలి నాణ్యత కూడా మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం.. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 275 వద్ద ఉంది. అయినప్పటికీ ఇంకా పూర్ కేటగిరీలోనే ఉన్నట్లు తెలిపింది. ఆనంద్ విహార్ అన్ని పర్యవేక్షణ స్టేషన్లలో అత్యధిక AQI 414 వద్ద నమోదు చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లు 200 AQI స్థాయిలతో గాలినాణ్యతను నమోదు చేసినట్లు CPCB డేటా తెలిపింది.






