- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కరోజు గాలి పీలిస్తే 6 సిగరెట్లు కాల్చినట్లు.. ఆందోళనకరంగా ఢిల్లీ వాయు కాలుష్యం
దేశంలో చలికాలం మొదలైంది. చలి మొదలవ్వడంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. AQI( Air quality index) ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించినట్టు తెలుస్తోంది. ఐటీవో దగ్గర ఏక్యూఐ 284గా నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో చలికాలం మొదలైంది. చలి మొదలవ్వడంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. AQI( Air quality index) ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించినట్టు తెలుస్తోంది. ఐటీవో దగ్గర ఏక్యూఐ 284గా నమోదైంది. అంతే కాకుండా అశోక్ విహార్ లాంటి ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో రీడింగ్ 326 నుండి 412 వరకు నమోదైంది. ఢిల్లీలో ప్రస్తుతం శ్వాస తీసుకోవడం రోజుకు 6.1 సిగరెట్లు కాల్చినంత హానికరం అని AQI అభిప్రాయపడుతోంది.
దీంతో కాలుష్యం నివారణకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలు పెట్టింది. నీటి తుంపర ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు దీపావళి ఉండటంతో పాటసుల వల్ల కాలుష్యం మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాలుష్యం పెరుగుతున్నందున ఢిల్లీ-ఎన్సీఆర్ నివాసితులు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. విషపూరితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. వాకింగ్, జాగింగ్ కోసం బయటకు రావొద్దని ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.






